ప్రధాని మోదీని కలిసిన ఎమ్మెల్యే నాయకర్

W.G: రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని నరసాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. శంకుస్థాపన సభప్రాంగణం వద్ద మోదీని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హయాంలో మోదీ ఆశీస్సులతో అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మాణం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.