VIDEO: పొలం విషయంలో ఘర్షణ.. కత్తులతో దాడి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట మండలం నారంవారి గూడెంలో పొలం విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకుంది. కత్తులతో, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఖమ్మం జిల్లా ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.