నగరంలో ఉచిత సినిమాలు

నగరంలో ఉచిత సినిమాలు

HYD: నగరంలోని ప్రభుత్వ బహిరంగ కళా వేదిక 'లలితాకళాతోరణం' మళ్లీ కళకళలాడుతోంది. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో ఉన్న లలితాకళాతోరణం ఓపెన్ థియేటర్ వేదికపై ఉచితంగా సినిమాలను ప్రదర్శిస్తున్నారు. ఏప్రిల్ 14న ప్రారంభమైన సినిమా పండుగ, 18 వరకు కొనసాగుతుంది. ఏప్రిల్ 15న కోర్ట్, 16న తండేల్, 17న బలగం, 18న జనతా గ్యారేజ్ సినిమాలను ప్రదర్శిస్తున్నారు.