పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించిన ఎస్పీ

పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించిన ఎస్పీ

PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు పూర్వాపరాలను విచారణ చేసి చట్ట పరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.