'లక్ష్యం మేరకు చేప పిల్లలను విడుదల చేయాలి'

'లక్ష్యం మేరకు చేప పిల్లలను విడుదల చేయాలి'

KMM: నవంబర్ నెలాఖరు లోపు లక్ష్యం మేరకు చేప పిల్లలను విడుదల చేయాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ డాక్టర్ పీ. శ్రీజ తెలిపారు. జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ శుక్రవారం ఖమ్మం రూరల్ మండల కేంద్రంలో చేప పిల్లల పంపిణీ చేసే డిస్ట్రిబ్యూషన్ పాయింట్‌ను పరిశీలించారు. అనంతరం ఆరెంపుల బారుగూడెం నల్ల చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు.