విద్యార్థులకు ముఖ్య గమనిక

SRD: బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులకు 40 అడ్మిషన్ల చొప్పున మొత్తం160 సీట్లు ఉన్నాయన్నారు. మే 5 నుంచి ఈనెల 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.