పెన్షన్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వృద్ధుడు

పెన్షన్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వృద్ధుడు

WGL: రాయపర్తి మండలానికి చెందిన పెన్షన్ లబ్ధిదారుడు ఎల్లయ్య ఇవాళ మీడియాతో మాట్లాడారు. నెలనెల పెన్షన్ కోసం పోస్టాఫీస్ ఉద్యోగులు అరిగోసపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా పంచాయతీ ఆఫీస్‌కు తిరగలేకపోతున్నామని చెప్పారు. ఐరిష్, వేలిముద్రలు పడకపోవడంతో ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వెళ్తున్నామని వాపోయారు. ఈ సమస్య పై అధికారులు స్పందించాలని కోరారు.