'రూ.1.50 కోట్లతో అంతర్గత రోడ్ల అభివృద్ధి'
NTR: విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.1.50 కోట్లతో అంతర్గత రహదారుల అభివృద్ధికి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాధ్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం రైతులు విక్రయానికి తెచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు.