పొలాలను పరిశీలించిన ఏవో

ASR: విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చింతపల్లి ఏవో మధుసూధనరావు రైతులకు సూచించారు. సోమవారం చిన్నగెడ్డలో పర్యటించారు. రైతులతో వరి పొలాలు పరిశీలించారు. వరి పొలాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. నీరు బయటకు వెళ్లేలా పొలాల్లో బాటలు వేయాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, రైతులకు అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.