163 BNSS సెక్షన్ అమలు: సీపీ
మంచిర్యాల జిల్లాలోని ఈనెల 17న భీమారం, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాలలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి 163 BNSS సెక్షన్ అమలు చేస్తున్నట్లు రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. డిసెంబర్ 15న సాయంత్రం 5 గంటల నుంచి 17న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి ఫలితాలు వెల్లడి వరకు సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.