గుంటుపల్లిలో రైతుపై దాడి చేసిన ఎలుగుబంటి
ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలోని గుంటుపల్లి గ్రామ సమీపంలో ఓ రైతుపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన సోమవారం జరిగింది. ఈ ఘటనలో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే పొలంలో కాపలా ఉన్న నాగయ్య అనే రైతుపై దాడి చేయడంతో స్థానికులు స్పందించి ఆసుపత్రికి తరలించారు. గ్రామ సమీపంలో అటవీ ప్రాంతం ఉండటంతో ఎలుగుబంటి పొలంలోకి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.