VIDEO: జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం

VIDEO: జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం

కృష్ణా: గుడివాడ బేతవోలులో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఇంటికి పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను చేరవేసేలా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.