బీజేపీ ఆధ్వర్యంలో విభజన గాయాల స్మృతి దినం

KNR: ఆగస్టు 14 విభజన గాయాల స్మృతి దినంను పురస్కరించుకొని బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్ నుంచి బస్టాండ్ వరకు మౌన ప్రదర్శన నిర్వహించారు. హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగిడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రతి ఏటా ఆగస్టు 14న విభజన గాయాల సంస్మరణ దినం నిర్వహిస్తుందని తెలిపారు.