టీడీపీకి ఓట్లు వేశారని.. తలలు పగలగొట్టారు

తూ.గో: వైసీపీకి ఓట్లు వేయలేదనే కక్షతో టీడీపీ సానుభూతిపరులపై దాడి చేసిన ఘటన విశాఖలో జరిగింది. మహిళలని కూడా చూడకుండా రాత్రివేళ ఇంట్లోకి చొరబడి తలలు పగలగొట్టారు .సుంకరి ఆనందరావు భార్య ధనలక్ష్మి, కుమార్తె, కుమారుడులతో కలిసి ఉంటున్నారు. ఇటీవల ఎన్నికల సమయంలో వారు టీడీపీకి ఓటు వేశామని చెప్పడంతో స్థానికంగా ఉన్న లావేటి లోకేశ్ అనే యువకుడు మద్యం తాగి దాడి చేసినట్లు తెలిపారు.