కమ్యూనిటీ భవనం కోసం ఎమ్మెల్యేకు వినతి
VZM: రాజాం పట్టణంలో నాయి బ్రాహ్మణుల కోసం కమ్యూనిటీ భవనం నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ నాయి బ్రాహ్మణ సంఘ నేతలు ఆదివారం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌కు వినతి పత్రం అందజేశారు. రాజాంలో నాయి బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ కమ్యూనిటీ భవనం లేకపోవడంతో సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించలేకపోతున్నామని తెలిపారు.