టికెట్ ధరల తగ్గింపు

టికెట్ ధరల తగ్గింపు

HYD: హైదరాబాద్ ఆర్టీసీ 'ట్రావెల్ యాజ్ యూ లైక్' టికెట్ ధరలను తగ్గించింది. పెద్దలకు రూ.150 నుంచి రూ.130, మహిళలు, సీనియర్ సిటిజన్లకు రూ.120 నుంచి రూ.110, పిల్లలకు రూ.100 నుంచి రూ.90 కి తగ్గించారు. ఈ టికెట్‌తో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌తో పాటు మెట్రో డీలక్స్ బస్సుల్లో ఒక రోజంతా ప్రయాణించవచ్చు. ఈ అవకాశం ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉంటుంది.