తిరువూరులో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

ఎన్టీఆర్: తిరువూరులో శుక్రవారం క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కరుణామయుడు ఏసుక్రీస్తు మన పాపాలను పరిహరించడం కోసం, శిలువ మీద కొట్టబడి తన ప్రాణాలను అర్పించిన రోజున క్రైస్తవ సోదరులు పవిత్ర శుక్రవారం పండుగను జరుపుకుంటారని తెలిపారు. యేసుక్రీస్తు దీవెనలు అందరికీ ఉండాలని క్రైస్తవ సోదరులు సిలువను మోస్తూ పట్టణ వీధుల్లో ప్రదర్శన చేశారు.