విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: ఎమ్మెల్యే
E.G: 46వ డివిజన్‌లోని రామదాసుపేట, వెంకటాపురం తదితర ప్రాంతాల్లో MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటించారు. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదన్న ఫిర్యాదులపై స్పందించిన ఆయన, క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. ప్రజారోగ్యం దృష్ట్యా పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.