కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరిక

కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరిక

GDWL: కేటీదొడ్డి మండలం ఈర్లబండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు ఆదివారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. రవి, పెద్దబావి వీరేష్, మల్కా శ్రీను, జేసీబీ రంగన్నతో పాటు పలువురు ముఖ్య నాయకులు గద్వాల పట్టణంలోని నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌ఛార్జి బాసు హనుమంతు నాయుడు స్వగృహం నందు ఆయన సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.