VIDEO: బస్సును ఢీకొట్టిన లారీ.. పలువురికి గాయాలు
SRPT: బస్సును వెనక నుంచి లారీ ఢీకొట్టి పలువురికి గాయాలు అయిన ఘటన ఆదివారం రాత్రి ఆత్మకూర్ ఎస్ మండలం నెమ్మికల్‌లో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. సూర్యాపేట వెళుతున్న బస్సును నెమ్మికల్ గ్రామ శివారులో లారీ వెనక నుంచి ఢీ కొట్టడంతో పలువురికి గాయాలైనట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.