ఆహారంలో పురుగుల మందు కలుపుకొని తిని మృతి

RR: మియాపూర్‌లో ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసులో పురోగతి సాధించారు. ఆహారంలో ఎలుకల మందు కలుపుకొని తిని మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఆహార నమూనాలను పరీక్షలకు పంపిన అనంతరం మియపూర్ పోలీసులు నిర్దారించారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తుండగా.. కుటుంబ పెద్ద అనారోగ్యం కూడా కారణంగా భావిస్తున్నారు.