దీక్ష విరమించిన BSNL మహిళా ఉద్యోగి

GNTR: తెనాలి బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద గత పది రోజులుగా దీక్ష చేస్తున్న మహిళా ఉద్యోగి పద్మావతి బుధవారం దీక్ష విరమించారు. వివిధ ప్రాంతాల నుంచి తెనాలి వచ్చిన యూనియన్ నేతలు ఇక్కడ అధికారులతో మాట్లాడి ఇచ్చిన హామీ మేరకు దీక్ష విరమించినట్లు పద్మావతి తెలిపారు. కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను ప్రవేట్ సంస్థకు అప్పగించడాన్ని యూనియన్ నేతలు వ్యతిరేకించడం జరిగిందన్నారు.