ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్
అన్నమయ్య: జిల్లాలో భద్రపరిచిన ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం తనిఖీ నిర్వహించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గోదాంలోని ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. గోదాంపై 24 గంటలపాటు పటిష్ట నిఘా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.