అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం
TPT: గూడూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని నరసింగరావుపేట సెక్టార్ బ్రహ్మంగారిమఠం అంగన్వాడీ కేంద్రంలో గురువారం పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో మెహబూబీ పాల్గొని బలవర్ధకమైన ఆహారం తీసుకుని చిన్నతనం నుండే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండేలా తల్లులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. అలాగే ఆటపాటలపై పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ కనపరచాలన్నారు.