ALERT: పిడుగులతో కూడిన వర్షాలు
AP: రాష్ట్రంలో రానున్న రెండు రోజులు భిన్న వాతావరణం ఉండనుంది. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం నుంచి ప.గో. వరకు ఓ మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడవచ్చు. మరోవైపు ఇవాళ చింతూరు, కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండనుంది.