ధాన్యం కొనుగోలు కేంద్ర ఏర్పాటుకు వినతి

ధాన్యం కొనుగోలు కేంద్ర ఏర్పాటుకు వినతి

JGL: పెగడపల్లి మండలం ఏడుమోటలపల్లి గ్రామంలో ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం గ్రామ రైతులు, నాయకులు జిల్లా సహకార అధికారి మనోజ్ కుమార్‌కు వినతి పత్రం సమర్పించారు. కొనుగోలు కేంద్రం కోసం మంత్రి లక్ష్మణ్ కుమార్ సహకారంతో గ్రామంలో మూడు ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించడం జరిగిందని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు.