మైనారిటీ గురుకుల కళాశాల విద్యార్థులకు కలెక్టర్ సన్మానం
MNCL: బెల్లంపల్లి మైనారిటీ గురుకుల కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం హర్షించదగ్గ విషయమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మైనారిటీ గురుకుల కళాశాల ఇంటర్లో టాప్ మార్కులు సాధించిన విద్యార్థినులను సోమవారం శాలువాతో సన్మానించారు. ప్రభుత్వ కళాశాలల్లో అనుభవజ్ఞులైన అధ్యాపకులతో నాణ్యమైన బోధన అందుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.