స్థల వివాదం.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ
అనంతపురం: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గొడవ జరిగింది. బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామంలో భూమి విషయంలో అన్నదమ్ముల గొడవ పడ్డారు. చిన్న పెదన్న, అనసూయకి గాయాలు అయ్యాయి. చికిత్స కోసం అనసూయని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ఆవరణంలోనే ఇరువర్గాలు ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్నారు.