సురవరం సుధాకర్ రెడ్డికి నివాళి

SRPT: సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మృతికి హుజూర్‌నగర్ జంగిడి సెంటర్‌లో మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి దేవరం మల్లేశ్వరి ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. సుధాకర్ రెడ్డి జీవిత పోరాటం, ప్రజా సమస్యలపై ఆయన చేసిన కృషి నేటి తరానికి ఒక మార్గదర్శకం అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య నాయకురాళ్లు, ప్రజా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.