కుక్కల దాడిలో 25 గొర్రెలు మృతి

NGKL: గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో 25 మృతిచెందగా, మరో 25 గొర్రెలకు గాయాలయ్యాయి. అచ్చంపేటకు చెందిన మంత్రాల సాయిలు, మేడమోని రేణయ్య గొర్రెలను నడింపల్లి గ్రామ శివారులో దొడ్డిలో ఉంచగా బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. రూ.2.5 లక్షల వరకు ఆస్థి నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.