నంద్యాల శివారులో దొంగతనం

NDL: పట్టణ శివారులోని నంది పారడైజ్‌లో నాలుగు ఇళ్లలో దొంగలు జోలి చేశారు. హౌస్ నెంబర్ 42,49 ఇళ్లలో విలువైన వస్తువులు పోలేదని, హౌస్ నెంబర్ 45లో రూ. 50,000 విలువగల బంగారం, హౌస్ నెంబర్ 48లో రూమ్ 1.10లక్షలు నగదు చోరీకి గురైందని బాధితులు తెలిపారు. పట్టణ శివారు ప్రాంతం కావడంతో నిఘా సరిగా లేకపోవడంతో దొంగలు విజృంభిస్తున్నారని స్థానికులు ఆరోపించారు.