రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: ఎస్సై

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: ఎస్సై

SRCL: రోడ్డు ప్రమాదాల నివారణకు భద్రత నియమాలు తప్పకుండా పాటించాలని చందుర్తి ఎస్సై రమేష్ అన్నారు. మండలంలోని మల్యాల గ్రామంలో శుక్రవారం రాత్రి అవగాహన సదస్సును నిర్వహించారు. ప్రతి వ్యక్తి సురక్షితంగా తమ గమ్యస్థానం చేరుకోవడమే లక్ష్యంగా గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలన్నారు.