VIDEO: భారీ వాహనాలతో ట్రాఫిక్‌కు అంతరాయం

VIDEO: భారీ వాహనాలతో ట్రాఫిక్‌కు అంతరాయం

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో భారీ వాహనాల రాకపోకలతో ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయని వాహనదారులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద భారీ కంటైనర్, లారీ రావడంతో వాహనాలు చాలాసేపు నిలిచిపోయాయి. స్థానిక పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు.