VIDEO: మురికి కాలువతో ఇబ్బందులు
KMR: నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావుపల్లిలోని ఎస్సీ కాలనీలో మురికి కాలువ నీరు రోడ్డు మీదకు రావడంతో కాలనీ నివాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలువలు సరిగా లేకపోవడంతో మురుగు నీరు రోడ్లపై చేరి దుర్వాసన వ్యాపిస్తోంది. దీంతో కాలనీలోని ప్రజలు రాకపోకలకు కూడా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి కాలువలను శుభ్రం చేసి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కొరారు.