దళిత రత్న అవార్డు గ్రహీతకు సత్కారం

WGL: వరంగల్ జిల్లా MRPS అధ్యక్షుడు చిరంజీవికి ఇటీవల దళితరత్న అవార్డు లభించింది. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ 20వ డివిజన్ కార్పొరేటర్ నరేంద్రకుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఉదయం ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మండల యూత్ అధ్యక్షులు కొరివి పరమేశ్వర్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కాశిబుగ్గ వాసులు, తదితరులున్నారు.