ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలపై ప్రత్యేక ప్రచారం

ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలపై ప్రత్యేక ప్రచారం

బాపట్ల: ధర్మవరంలో ఉపాధ్యాయులు 'బడి పిలుస్తోంది' కార్యక్రమంతో చేరికలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు ప్రత్యేక ప్రచారం నిర్వహించారు. పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించి పిల్లలను చేర్చాలని కోరారు. కార్యక్రమంలో హెచ్ఎం ఊటుకూరు శ్రీనివాసులు పాల్గొన్నారు.