సనత్‌నగర్‌లో హరితహారం కార్యక్రమం

HYD: సనత్‌నగర్ పరిధిలో బుధవారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. దీనికి కార్పొరేటర్ లక్ష్మీ బాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పార్కులో కార్పొరేటర్ మొక్కలు నాటి మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో సనత్‌నగర్‌లో ఎన్నో పార్కులను అభివృద్ధి చేశామన్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.