రాష్ట్ర స్థాయి పోటీలకు ధర్మారం విద్యార్థి ఎంపిక

రాష్ట్ర స్థాయి పోటీలకు ధర్మారం విద్యార్థి ఎంపిక

PDPL: ధర్మారం మండలంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎన్. తేజస్విని 69వ రాష్ట్రస్థాయి ఎసీఎఫ్ అండర్-14 ఫుట్బాల్ పోటీలకు ఎంపికైంది. గోదావరిఖనిలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి అర్హత సాధించింది. రాష్ట్ర పోటీలు ఈనెల 3 నుంచి 5 వరకు వికారాబాద్ జిల్లాలో జరుగనున్నాయి.