జాతీయ రహదారిపై గుంతలు

BHNG: భువనగిరి జగదాపూర్ 65వ జాతీయ రహదారిపై తుర్కపల్లి మండలం ములకలపల్లి శివారులో రోడ్డు మూలమలుపు వద్ద, వర్షపు నీటితో ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా మారాయి. ఈ గుంతలలో నీరు నిలిచి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. R&B అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.