కాకినాడ ఇంఛార్జ్ కమిషనర్‌గా మనీషా
కాకినాడ జిల్లాలో వివిధ కేడర్లలో శిక్షణ పొందుతున్న ఐఏఎస్ అధికారి మనీషా ప్రస్తుతం అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో ఉన్నారు. ఆమె మంగళవారం నుంచి వారం రోజులపాటు కాకినాడ నగరపాలక సంస్థ ఇంఛార్జ్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆమె కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకోగా, కమిషనర్ సత్యనారాయణ స్వాగతం పలికి, కార్యకలాపాలను ఆమెకు వివరించారు.