VIDEO: భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక హారతి
WGL: ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి భద్రకాళి అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాత్రి అర్చకులు అమ్మవారికి భక్తుల సమక్షంలో హరతి ఇచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకోగా.. పలువురు భక్తులు హారతిని తమ సెల్ ఫోన్లలో బంధించుకున్నారు.