రెండు రోజులుగా పనిచేయని భూభారతి సేవలు

రెండు రోజులుగా పనిచేయని భూభారతి సేవలు

MDK: చిన్నశంకరం పేటలోని తాహసీల్దార్ కార్యాలయంలో రెండు రోజులుగా అంతర్జాలం రాకపోవడంతో భూభారతి సేవలు నిలిచిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసినప్పటికీ ఇంటర్‌నెట్ రాకపోవడంతో రైతులు నిరాశతో వెనుతిరిగారు. ఈ విషయమై RI రాజును వివరణ కోరగా.. ఇంటర్‌నెట్ సరిగ్గా రాకపోవడంతో భూభారతి సేవలు నిలిచిపోయాయని, సంబంధిత ఇంటర్‌నెట్ వారికి ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు.