హంసలదీవికి త్రాగునీరు అందించిన ఎమ్మెల్యే

కృష్ణా: వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో తీర గ్రామాల దాహం తీర్చేందుకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఉచిత త్రాగునీరు సరఫరా చేశారు. గురువారం కోడూరు మండలం హంసలదీవి గ్రామ ప్రజలకు ఇరవై వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన వాటర్ ట్యాంకర్ ద్వారా త్రాగునీరు సరఫరా చేశారు. మండలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ పర్యవేక్షించారు.