డ్రైనేజీలో పడి బాలుడు మృతి

కృష్ణా: విజయవాడ గుణదల గంగిరెద్దులు దిబ్బ వద్ద సైడ్ డ్రైనేజీలో పడి మణికంఠ(7) అనే బాలుడు మృతిచెందాడు. డ్రైనేజీలో కొట్టుకుంటూ గుణదల సెంటర్ వద్దకు వచ్చిన మణికంఠ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో గుణదల ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆడుకుంటూ వెళ్లి సైడ్ డ్రైన్‌లో పడిపోయాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.