చోరీ కేసు.. 24 గంటల్లో చేదించిన పోలీసులు
NRML: నర్సాపూర్ మండలంలోని ఓ కిరాణా దుకాణంలో గురువారం రాత్రి జరిగిన చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. బరుకుంట శ్రీరామ్ (24) అనే వ్యక్తిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.3500 నగదు, 8 సిగరెట్ ప్యాకెట్లు, ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించామని ఏఎస్పీ తెలిపారు.