ప్రగతి ధర్మారంలో ఎయిడ్స్‌పై అవగాహన

ప్రగతి ధర్మారంలో ఎయిడ్స్‌పై అవగాహన

MDK: రామాయంపేట ప్రగతి ధర్మారం పీహెచ్‌సీలో ఎయిడ్స్ నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. సురక్షిత పద్ధతులు పాటిస్తేనే ఎయిడ్స్ రహిత సమాజం సాధ్యమని వైద్యులు తెలిపారు. వ్యాధిగ్రస్తులపై వివక్ష చూపకుండా మానవత్వంతో ఆదరించాలని, అపోహలు వీడి అవగాహనతో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొని నివారణా చర్యలపై చర్చించారు.