నిడదవోలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సత్యనారాయణ
E.G: నిడదవోలు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కైకరపు సత్యనారాయణ భారీ మెజారిటీతో విజయం సాధించారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో కార్యదర్శిగా ఆకుతోట సతీశ్ కుమార్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని తోటి న్యాయవాదులు ఘనంగా అభినందించారు. తనపై నమ్మకంతో గెలిపించిన సభ్యులందరికీ సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.