జగజ్జనని కాళికా మహాదేవి ముఖద్వారం శంకుస్థాపన

NLG: చింతపల్లి మండలం అంగడి కుర్మపల్లి లో ఆదివారం జరిగిన శ్రీ శ్రీ శ్రీ జగజ్జనని కాళికా మహాదేవి ముఖద్వారము శంకుస్థాపన కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొన్నారు. జగజ్జనని కాళికా మహాదేవి అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.