కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడిగా వడ్డే రాజు ఏకగ్రీవం

MBNR: గండీడ్ మండలం పెద్దవార్వల్ గ్రామంలో మండల అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, పీసీసీ సభ్యులు నరసింహ రావు ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల ముందస్తు నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామానికి చెందిన వడ్డే రాజును కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం అయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలన్నారు.