'ఉచిత ప్రయాణానికి ఒరిజినల్ ఐడీ ఉండాలి'

KDP: ప్రొద్దుటూరులో స్త్రీ శక్తి పథకం కింద RTC బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ఒరిజినల్ ఐడీ కార్డు, డిజిటల్ కాపీ మాత్రమే చెల్లుబాటు అవుతుందని ప్రొద్దుటూరు RTC డిపో మేనేజర్ మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఫొటోస్టాట్ పేపర్లు, సెల్ ఫోన్లో ఫోటో తీసుకున్న చిత్రాలను అనుమతించరని ఆయన తెలిపారు. ఈ మేరకు మహిళా ప్రయాణికులు RTC కండక్టర్లు, సిబ్బందికి సహకరించాలన్నారు.